News August 20, 2025
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు విముఖత చూపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాల నేతలు వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ ఉదయం కూడా సభ వాయిదా పడింది.
Similar News
News August 20, 2025
ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే: రేవంత్

TG: ప్రపంచస్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్థాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించినా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని నొక్కి చెప్పారు.
News August 20, 2025
ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.
News August 20, 2025
ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.