News June 22, 2024
NEET పేపర్ లీక్పై కేంద్రం విచారణ జరుపుతోంది: MP రఘునందన్

TG: NEET పేపర్ లీక్పై కేంద్రం విచారణ జరుపుతోందని BJP MP రఘునందన్ వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఐటీఐఆర్ కింద ప్రతిపాదించిన అన్ని పనులను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. అటు KCRపైనా ఆయన విమర్శలు చేశారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ ఇంటికి ED అధికారులు రాక తప్పదని జోస్యం చెప్పారు.
Similar News
News January 27, 2026
లోకేశ్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు

AP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.
News January 27, 2026
ప్రారంభమైన అఖిలపక్ష భేటీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు రాజ్నాథ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి TDP తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు, YCP-మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్, BRS-సురేశ్ రెడ్డి, JSP నుంచి బాలశౌరి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై నేతలకు కేంద్రం ఇందులో సమాచారం ఇవ్వనుంది.
News January 27, 2026
నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.


