News December 6, 2024

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

image

తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. TGలోని జగిత్యాల, NZB, కొత్తగూడెం, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్యసాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్‌లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Similar News

News January 22, 2026

భోజ్‌శాలలో సరస్వతీ పూజ, నమాజ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

image

ధార్‌(MP)లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.

News January 22, 2026

అక్రమ సంబంధాలు.. కుటుంబాలు నాశనం!

image

కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు అలవాటుపడి పచ్చని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. HYD కూకట్‌పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్నీ బిగించి చంపేయగా, గుంటూరు(D) చిలువూరులో భార్య లక్ష్మి భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అటు భార్యలపై అనుమానాలతో భర్తలు వారిని చంపుతున్న ఘటనలూ పెరిగిపోయాయి. HYD రహ్మత్‌నగర్‌లో భర్త ఆంజనేయులు భార్య సరస్వతిని, అనంతపురంలో వీరాంజనేయులు తన భార్య లక్ష్మిని చంపేశారు.

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.