News November 5, 2024
Wikiకి కేంద్రం నోటీసులు

అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.
Similar News
News January 6, 2026
పరకామణి అంశంలో పోలీసు అధికారులపై కేసులకు హైకోర్టు ఆదేశం

AP: TTD పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీ, సీఐడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని ఆ రెండు విభాగాలకు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపు అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.
News January 6, 2026
EVలపై ప్రభుత్వోద్యోగులకు 20% రాయితీ ఇవ్వాలి: పొన్నం

TG: కాలుష్య నివారణకోసం ఎలక్ట్రానిక్ వాహనాలను పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తెలిపారు. ‘ప్రభుత్వ, వివిధ సంస్థల్లో 50% ఈవీలు ఉండేలా పాలసీ తెస్తాం. ప్రభుత్వోద్యోగులు EVలు కొంటే 20% రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఛార్జింగ్, ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం’ అని చెప్పారు. 15 ఏళ్లు పైబడిన వాహనాల్ని స్క్రాప్ చేస్తున్నామని, RTCలో ఈవీలను పెంచుతున్నామని తెలిపారు.
News January 6, 2026
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించాయి.


