News October 28, 2024

జనగణనకు సిద్ధమైన కేంద్రం?

image

2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

Similar News

News October 28, 2024

శాప్ నెట్‌ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్(శాప్ నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాప్ నెట్, మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఆ సేవలను విద్యామండలి నుంచే సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

News October 28, 2024

కోహ్లీ దేశవాళి క్రికెట్ ఆడాలి: DK

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రాణించలేకపోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఫామ్‌ను పొందేందుకు కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడడం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్పిన్‌ బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కోలేకపోవడంతో ఆయన ఈ సజెషన్ ఇచ్చారు. భారత్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

News October 28, 2024

పాకిస్థాన్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

image

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని PCB నియమించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. గ్యారీ కిర్‌స్టెన్ రిజైన్‌ను యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది. AUS తరఫున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడిన గిలెస్పీ మొత్తం 401 వికెట్స్ తీశారు. ప్రస్తుతం పాక్ టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్నారు.