News July 11, 2024
ఉపాధి కల్పనపై కేంద్రం రిపోర్ట్స్.. నిపుణులు ఏమంటున్నారంటే?
బడ్జెట్ సమీపిస్తున్న వేళ ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. FY24లో 4.67కోట్ల ఉద్యోగాలు (మొత్తంగా 64.33కోట్లు) వచ్చాయని RBI చెబుతోంది. CITI BANK నివేదికకు (2012 నుంచి ఏటా 88లక్షల జాబ్స్) కౌంటర్‌గా ఏటా సగటున 2కోట్ల జాబ్స్ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర, RBI నివేదికలతో కొందరు ఏకీభవిస్తుంటే.. స్వీయఉపాధి, సాగు రంగాల్లో వృద్ధి ఉందని ఉద్యోగాల్లో కాదని మరికొందరు తప్పుపడుతున్నారు.
Similar News
News January 19, 2025
నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు
AP: వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు అధికారుల బృందం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడనుంచి జ్యూరిచ్ వెళ్లనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ పర్యటనలో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.76 కోట్లు రిలీజ్ చేసింది.
News January 19, 2025
అత్యధిక వికెట్లు.. కానీ CTలో నో ఛాన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి వన్డేల్లో ఎక్కువ వికెట్లు (71) తీసిన భారత బౌలర్ అతడేనని గుర్తు చేస్తున్నారు. అయితే సిరాజ్‌కు న్యూ బాల్‌తో బౌలింగ్ వేసే ఛాన్స్ రాకపోతే అంత ప్రభావవంతంగా కనిపించడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్ కొత్త, పాత బంతితో బౌలింగ్ వేయగలడని తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News January 19, 2025
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.