News March 14, 2025
ఎలాన్ మస్క్ Starlinkకు కేంద్రం షరతులు!

ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో జట్టుకట్టిన స్టార్లింకుకు కేంద్రం కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రవేశించాలంటే కచ్చితంగా కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. శాంతిభద్రతల నియంత్రణకు ఇది కీలకం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటినప్పుడు ఇంటర్నెట్ను నిలిపివేయాలంటే ప్రతిసారీ USలోని స్టార్లింక్ ఆఫీస్ను సంప్రదించడం కుదరదు. అందుకే షరతులు పెట్టింది.
Similar News
News March 14, 2025
రేపటి నుంచి ఒంటిపూట అంగన్వాడీ కేంద్రాలు

TG: అంగన్వాడీ కేంద్రాలను రేపటి నుంచి ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. అటు పాఠశాలలు కూడా రేపటి నుంచి ఒంటిపూట నడవనున్నాయి.
News March 14, 2025
రెండు రోజులు బ్యాంకులు బంద్!

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు UFBU సమ్మె చేస్తోంది.
News March 14, 2025
‘ఛావా’ కలెక్షన్ల ప్రభంజనం

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలో 4 వారాల్లో రూ.540.38 కోట్లు, తెలుగులో తొలి వారంలో రూ.11.80 కోట్లు వసూలు చేసింది. హోలీ హాలిడే, వీకెండ్ కావడంతో ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.