News July 23, 2024
కేంద్రం కీలక ప్రకటన.. త్వరలో ‘భూ-ఆధార్’

దేశంలోని గ్రామీణ ప్రాంతాల భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా భూ ఆధార్ నంబర్ ఇవ్వనుంది. భూ మ్యాప్‌లు డిజిటలైజ్ చేయడం, ప్రస్తుత యాజమానులకు అనుగుణంగా మ్యాప్‌లను సబ్ డివిజన్లుగా విభజించడం, భూరికార్డులు రూపొందించడం వంటివి కేంద్రం చేయనుంది. పట్టణ భూ రికార్డులను డిజిటైజేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
Similar News
News December 6, 2025
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.
News December 6, 2025
నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్‌తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.


