News December 12, 2024
సోషల్ మీడియా వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ వేదికగా మహిళలను వేధింపులకు గురి చేసిన వారిపై BNS సెక్షన్ 78 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర సమాచార శాఖ బదులిచ్చింది. సైబర్ నేరాలపై కూడా BNS చట్టాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది.
Similar News
News December 12, 2024
షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్
దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది. అక్కడ 80.90 లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది. ఈ జాబితాలో TG 4వ ప్లేస్లో ఉంది. రాష్ట్రంలో 24.52 లక్షల మంది డయాబెటిక్ బాధితులున్నారు. రెండో స్థానంలో MH(39.81 లక్షలు), మూడో ప్లేస్లో KA(28.74 లక్షలు) నిలిచాయి. ఇక APలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం.
News December 12, 2024
రాష్ట్రానికి తప్పిన ముప్పు
AP: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. ‘ఫెంగల్’తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని చెప్పింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంది.
News December 12, 2024
నేటి నుంచి రాజమండ్రి- ఢిల్లీ విమాన సర్వీసులు
AP: రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి, ఇక్కడి నుంచి ఉదయం 9.30కు బయలుదేరి వెళ్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు సంతోష పడుతున్నారు.