News April 13, 2024
‘బోర్న్‌విటా’పై కేంద్రం కీలక ఆదేశాలు
ఇ-కామర్స్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బోర్న్‌విటాతోపాటు అన్ని రకాల పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. బోర్న్‌విటాలో పరిమితికి మించి షుగర్ లెవల్స్ ఉన్నట్లు NCPCR పరిశోధనలో తేలింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా పవర్ సప్లిమెంట్లను హెల్త్ డ్రింక్స్‌గా ప్రచారం చేసుకుంటోన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని FSSAIని NCPCR ఇటీవల కోరింది.
Similar News
News November 16, 2024
ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్త!
Southeast Asia నుంచి, ముఖ్యంగా కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాలకు వెళ్లిన వారిలో 30 వేల మంది భారతీయుల ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో రప్పించి వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు భారత ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
News November 16, 2024
ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదం: నర్స్ అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే?
యూపీలోని ఝాన్సీ ఆస్పత్రిలో ఓ నర్సు అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే <<14624059>>అగ్ని ప్రమాదం జరిగిందని<<>> భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘ఆ సమయానికి నేను వార్డులోనే ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ఓ నర్సు అగ్గిపెట్టెను వెలిగించారు. దీంతో వెంటనే నిప్పు అంటుకుంది. నలుగురు పిల్లల్ని గుడ్డలో చుట్టి బయటికి తీసుకొచ్చేశాను. తర్వాత ఇతరుల సాయంతో మరింతమందిని కాపాడగలిగాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
నయన్ పోస్ట్‌పై త్వరలోనే స్పందించనున్న ధనుష్!
హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార <<14627063>>సంచలన పోస్ట్ <<>>నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ స్పందించారు. హీరోయిన్ పోస్ట్‌కు త్వరలోనే ధనుష్ సమాధానం చెప్తారని పేర్కొన్నారు. కాగా నయనతారపై చేసిన డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై నయన్ తీవ్రంగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.