News August 17, 2024

లా అండ్ ఆర్డ‌ర్‌పై కేంద్రం కీల‌క ఆదేశాలు

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ పై హ‌త్యాచార ఘ‌ట‌న, అనంత‌ర ప‌రిణామాల‌ నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, UTలు త‌మ ప‌రిధిలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితులపై ప్ర‌తి రెండు గంట‌ల‌కోసారి త‌మ‌కు రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. ఫ్యాక్స్‌, ఈ-మెయిల్‌, వాట్సాప్ ద్వారా కంట్రోల్ రూంకు నివేదికలు పంపాల‌ని కోరింది.

Similar News

News November 15, 2025

భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

image

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>

News November 15, 2025

CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

image

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.

News November 15, 2025

కలియుగ ధర్మ సూత్రమిదే..

image

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.