News November 28, 2024
‘ప్రత్యేక హోదా’పై కేంద్రం కొత్త రాగం.. సరికొత్త చర్చ

APకి ప్రత్యేక హోదా హామీని మౌఖికంగా ఇచ్చామని, రాతపూర్వకంగా ఇవ్వలేదని కేంద్రం చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల హోదా ఇవ్వలేదన్న కేంద్రం ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. ఇలా అయితే పార్లమెంట్ సాక్షిగా PM ఇచ్చిన వాగ్దానానికి విలువలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాతపూర్వక హామీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పించుకోవడం సరికాదని నిపుణుల అభిప్రాయం. మీరేమంటారు?
Similar News
News January 21, 2026
భయపడొద్దు పార్టీ అండగా ఉంటుంది: జగన్

AP: ప్రభుత్వ దన్నుతో కూటమి నేతలు, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని దిగజారుస్తున్నారని YCP చీఫ్ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ కుమారులు, పార్టీనేతలు తాడేపల్లిలో జగన్ను కలిశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. కాగా ఎవరూ భయపడొద్దని, అక్రమ కేసులపై పార్టీ లీగల్ సెల్ న్యాయసహాయం అందిస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
News January 21, 2026
హైదరాబాద్లోని NIRDPRలో 98 ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)98 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: career.nirdpr.in/
News January 21, 2026
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకోవాలంటే..

హిందూ సంప్రదాయంలో పసుపుకు ప్రాధాన్యం ఎక్కువ. పసుపును ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు పసుపు రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్ల నొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది.


