News June 14, 2024
ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్‌టీపై కేంద్రం సమీక్ష!
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను విధించడాన్ని GST కౌన్సిల్ ఈనెల 22న జరిగే సమావేశంలో పునఃపరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు వస్తువులకు విధించే ఇన్వర్టెడ్ ట్యాక్స్ విధానంపైన ఫిట్‌మెంట్ కమిటీ సూచనలను సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా 2023 అక్టోబరు 1న ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% GSTని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఆరునెలలు దాటడంతో ముందుగా అనుకున్నట్టు కౌన్సిల్ దానిని పరిశీలించనుంది.
Similar News
News December 25, 2024
ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
News December 25, 2024
ఆతిశీని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా, Sr నేతలను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో 5 రోజుల్లో వీరిపై ఫేక్ కేసులు బనాయిస్తారని BJPని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ ఈ మధ్యే ప్రకటించిన CM మహిళా సమ్మాన్ యోజన, సంజీవనీ యోజన వారిని ఇరుకున పెట్టాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ట్వీట్ చేశారు.
News December 25, 2024
‘బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్‌లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం. వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు <<14584831>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.