News July 23, 2024
రాష్ట్రానికి తోడ్పాటునిచ్చేలా కేంద్ర బడ్జెట్: సీఎం
కేంద్ర బడ్జెట్ APకి అన్నివిధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో CM చంద్రబాబు అన్నారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలావరకు ఆమోదించినట్లు చెప్పారు. రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా సాయం అందొచ్చనే సమాచారం ఉందన్నారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉందని CM వివరించారు.
Similar News
News January 29, 2025
ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సా.5గంటల లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి ₹12వేలు అందించనుంది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి ₹6వేల చొప్పున జమ చేసింది.
News January 29, 2025
ఘోర విషాదం.. 20 మంది మృతి?
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఘటనపై మోదీ, షా ఆరా తీశారు.
News January 29, 2025
మహాకుంభ్ రైళ్ల రద్దుపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ
మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.