News July 30, 2024
₹185L crకు చేరనున్న కేంద్రం అప్పు

ఈ ఏడాది మార్చి నాటికి కేంద్రం అప్పు ₹171L cr అని కేంద్ర మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. ఇది జీడీపీలో 58.2 శాతానికి సమానమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పు ₹185L crకు చేరే అవకాశం ఉందని చెప్పారు.
Similar News
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<
News December 9, 2025
ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్పూర్కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
News December 9, 2025
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.


