News September 7, 2024
పూజ ఖేడ్కర్పై కేంద్ర ప్రభుత్వం వేటు

అఖిల భారత సర్వీసుల నుంచి వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. యూపీఎస్సీ ఆమె సెలక్షన్ను రద్దు చేసిన నెలరోజుల తరువాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ నుంచి ఆమె తొలగింపు ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. 1954 IAS (Probation) నియమావళి నిబంధన 12 కింద ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


