News November 25, 2024

దివ్యాంగుల పోస్టులపై కేంద్రం మార్గదర్శకాలు

image

దివ్యాంగులకు పోస్టులను కాలానుగుణంగా గుర్తించడానికి కమిటీలను తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కనీసం 40% వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్ధీకరించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా పోస్టు వారికి సరిపోతుందని భావిస్తే, తదుపరి ప్రమోషనల్ పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేయాలని తెలిపింది. వైకల్య నిర్ధారణకు ఏకరీతి మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Similar News

News November 26, 2025

‘సఫ్రాన్’ ఏర్పాటుతో MSMEలకు వ్యాపార అవకాశాలు: సీఎం రేవంత్

image

TG: HYDలో ‘సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కొత్త సెంటర్‌‌ ప్రారంభోత్సవంలో CM రేవంత్ పాల్గొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ₹13K కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సెంటర్‌తో స్థానిక MSMEలకు, ఇంజినీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయన్నారు. బెంగళూరు-HYDను డిఫెన్స్& ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని PMకు విజ్ఞప్తి చేశారు.

News November 26, 2025

BREAKING: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. దీనికి ‘సెన్యూర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇది 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News November 26, 2025

అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

image

AP: విద్యార్థులు ప్రాథమిక హక్కులనే కాకుండా ప్రాథమిక బాధ్యతలనూ తెలుసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏదైనా అంశంపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 175 మంది స్టూడెంట్లతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను గౌరవించిన, అన్ని రంగాల్లో ప్రోత్సహించిన దేశమే అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.