News June 16, 2024

తెలంగాణ, ఏపీ రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

image

కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఏడాదికి గాను 23 మంది రచయితలకు యువ పురస్కార్ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుకు TGలోని నిజామాబాద్‌కు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ ఎంపికయ్యారు. ఆయన గిరిజనుల జీవిత గాథలపై ‘ఢావ్లో’ అనే కథా సంకలనాన్ని రచించారు. అటు APలోని వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌ను ‘మాయాలోకం’ నవలకు గాను బాలసాహిత్య పురస్కారం వరించింది. సాహిత్య అకాడమీ వీరికి ₹50వేలు, జ్ఞాపిక ఇవ్వనుంది.

Similar News

News December 1, 2025

వెన్నెముక కింద డింపుల్స్ ఎందుకుంటాయంటే?

image

వెన్నెముక దిగువ భాగంలో డింపుల్స్ ఎందుకు ఉంటాయో వైద్యులు వివరించారు. వీటిని మహిళల్లో ‘వీనస్ డింపుల్స్’, పురుషుల్లో ‘అపోలో డింపుల్స్’ అంటారు. ‘తుంటి ఎముక చర్మాన్ని లిగమెంట్ లాగడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆడవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సహజ శరీర నిర్మాణం మాత్రమే. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. వెన్నెముక మధ్యలో ‘శాక్రల్ డింపుల్’ ఉంటే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.

News December 1, 2025

పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

image

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్‌లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్‌గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.

News December 1, 2025

42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

image

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.