News October 4, 2024
విచారణపై కేంద్రం పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది: తుషార్

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం ఉందని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా అన్నారు. అయితే విచారణపై కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. సుప్రీం ఏం చెబుతుందో వేచి చూడాలి.
Similar News
News December 9, 2025
NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 10.6, తెలకపల్లి 11.0, తాడూర్ మండలం యంగంపల్లిలో 11.1, అమ్రాబాద్లో 11.2, ఊర్కొండ 11.5, వెల్దండ 11.6, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


