News September 9, 2024

ఎల్లుండి తెలంగాణకు కేంద్ర బృందం: కిషన్‌రెడ్డి

image

TG: వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ నెల 11న కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. బాధితులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో వీరు సమావేశమై నష్ట వివరాలను తెలుసుకుంటారని చెప్పారు.

Similar News

News November 11, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.isro.gov.in/

News November 11, 2025

మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

image

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

News November 11, 2025

శబరిమలకు అద్దె బస్సులు

image

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.