News January 7, 2025
కరవు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన రేపటి నుంచి..
AP: రాష్ట్రంలోని కరవు మండలాల్లో రేపటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రేపు, ఎల్లుండి పర్యటించి కరవు పరిస్థితులను తెలుసుకోనుంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని 27మండలాల్లో తీవ్ర కరవు, మరో 27మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు 3బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు.
Similar News
News January 8, 2025
5 రోజులు సెలవులు.. నెట్టింట ఫైర్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రైవేటు హాస్టల్స్ 5 రోజులు సెలవులు ప్రకటించాయి. ఈనెల 13 నుంచి 17వరకు మెస్ పనిచేయదని, ఫుడ్ ఉండదని తెలిపాయి. ఇది హాస్టల్స్ అసోసియేషన్ ఆర్డర్ అని, దీనిని ఏ హాస్టలయినా అతిక్రమిస్తే రూ.20వేలు ఫైన్ విధిస్తుందన్నాయి. దీంతో 30 రోజులకూ ఫీజు చెల్లించామని, ఇలా 5 రోజులు ఫుడ్ లేకపోతే ఎక్కడ తినాలని హాస్టలర్స్ ఫైర్ అవుతున్నారు. పండుగ వేళ హోటల్స్ కూడా క్లోజవుతాయని వాపోతున్నారు.
News January 8, 2025
సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్
తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు
TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.