News December 28, 2024

మన్మోహన్ స్మారకార్థం స్థలం కేటాయించిన కేంద్రం

image

మన్మోహన్ సింగ్ <<14998092>>అంత్యక్రియలపై వివాదం<<>> రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.

Similar News

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

image

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

News December 6, 2025

జీఎస్టీ&సెంట్రల్ ఎక్సైజ్ చెన్నైలో ఉద్యోగాలు

image

జీఎస్టీ కమిషనర్&సెంట్రల్ ఎక్సైజ్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్, MTS పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన వారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://gstchennai.gov.in/

News December 6, 2025

‘రైట్ టు డిస్‌కనెక్ట్’.. ఏ దేశాల్లో అమల్లో ఉంది?

image

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులు ఆఫీస్ కాల్స్‌ను <<18487853>>డిస్ కనెక్ట్<<>> చేసే హక్కును 2017లో ఫ్రాన్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం దేశాలు ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి. ఇది ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, వారి శ్రేయస్సు, ప్రొడక్టివిటీకి ముఖ్యమని పేర్కొన్నాయి. ఇండియాలోనూ 2018, 2025లో ఇలాంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.