News December 28, 2024
మన్మోహన్ను కేంద్రం అవమానించింది: రాహుల్
భారతమాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రస్తుత ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానవాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్బోధ్ ఘాట్లో జరిపి అవమానించారు’ అని మండిపడ్డారు. అలాగే సింగ్కు మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు.
Similar News
News December 29, 2024
ఇతడు నిజమైన రాజు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్. మన్మోహన్ మరణవార్తను తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. కింద కూర్చొని సింగ్ సతీమణి గుర్శరణ్ కౌర్ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. తాను రాజుననే విషయం మర్చిపోయి అత్యంత గౌరవంగా వ్యవహరించారు. అతడు నిజమైన రాజు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News December 29, 2024
నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?
TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 29, 2024
జనవరి 1న సెలవు లేదు
జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.