News January 12, 2025

దక్షిణాదిపై కేంద్రం వివక్ష: డీఎంకే మంత్రి

image

పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.

Similar News

News December 4, 2025

సహజ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణ

image

AP: సహజ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే గైనకాలజిస్టులకు ‘అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ’ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. వాక్యూం ఎక్ట్ర్సాక్షన్, ఫోర్సెప్స్‌‌తో సహజ ప్రసవాలు ఎలా చేయవచ్చో వివరిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 6 నెలల పాటు నిర్దేశించిన తేదీల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

News December 4, 2025

నేడు పఠించాల్సిన మంత్రాలు

image

1. అష్టైశ్వర్యాల కోసం: ‘‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’’, ‘‘ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీదః’’, ‘‘శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః’’
2. దత్తాత్రేయుని అనుగ్రహం కోసం: ‘‘ఓం దత్తాత్రేయ విద్మహే దిగంబరాయ ధీమహీ తన్నో దత్తాః ప్రోచోదయాత్’’
3. చంద్ర దోషం తగ్గిపోవడానికి: ‘‘ఓం సోమాయ నమః, ఓం ఐం క్లీం సౌమాయ నమః, ఓం శీతాంశు, విభాంశు అమృతాంశు నమః’’

News December 4, 2025

భారతీయుడికి జాక్‌పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

image

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్‌కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్‌వైజర్‌గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.