News June 19, 2024
కెప్టెన్, వైస్ కెప్టెన్ సెంచరీలు.. భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(136), కెప్టెన్ హర్మన్(103) సెంచరీలతో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. షఫాలీ వర్మ(20), హేమలత(24), రిచా ఘోష్(25) పర్వాలేదనిపించారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News November 14, 2025
వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.
News November 14, 2025
టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ <
News November 14, 2025
ప్రాజెక్టులకు 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్: CM

AP: పరిశ్రమల ఏర్పాటు కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంచామని CM CBN చెప్పారు. CII సదస్సు పెట్టుబడుల కోసమే కాదని, మేధో చర్చల కోసం ఏర్పాటు చేశామన్నారు. సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పుతున్నామన్నారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. అనేక దేశాల ప్రతినిధులు సదస్సుకు రావటం సంతోషం కలిగిస్తోందన్నారు.


