News December 8, 2024

సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. ఇంగ్లండ్ ప్లేయర్ రికార్డ్

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఓ సెంచరీ, హ్యాట్రిక్, ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. కేవలం 10 టెస్టుల్లోనే అతను ఈ ఫీట్ నమోదు చేశారు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ 26 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు.

Similar News

News December 8, 2025

మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

image

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?