News February 25, 2025
3 ఓవర్లలోనే సెంచరీ.. మీకు తెలుసా?

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సృష్టించారని మీకు తెలుసా? 1931లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే సెంచరీ చేశారు. ఆ సమయంలో ఓవర్‌కు 8 బంతులు ఉండేవి. తొలి ఓవర్లో 33, రెండో దాంట్లో 40, మూడో ఓవర్లో 27 పరుగులు చేసి సెంచరీ బాదారు. ప్రస్తుతం ఓవర్‌కు 6 బంతులే ఉండటంతో 3 ఓవర్లలో సెంచరీ చేయడం అసాధ్యమే.
*ఇవాళ బ్రాడ్‌మన్ వర్ధంతి
Similar News
News February 25, 2025
రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
News February 25, 2025
బండి విజ్ఞతతో మాట్లాడాలి: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ టీమ్‌తో పోల్చుతూ కేంద్ర మంత్రి <<15574950>>బండి సంజయ్<<>> చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌ను ముడిపెట్టకుండా విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర రాజకీయాలు తెలియకుండా మాట్లాడొద్దని మండిపడ్డారు. గత పదేళ్లలో BRS చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు.
News February 25, 2025
అభిమానులకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ సర్ప్రైజ్?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చి 1న జీతెలుగులో సినిమా ప్రసారం కానుండగా థియేటర్లో డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా ఇందులో జోడించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే రోజే జీ5లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.