News November 26, 2024
₹3.5 కోట్ల జీతం మళ్లీ వదులుకున్న CEO
Zomato CEO దీపిందర్ గోయల్ ₹3.5 కోట్ల తన వార్షిక వేతనాన్ని మరో రెండేళ్లపాటు(2026 వరకు) వదులుకున్నారు. గోయల్ గతంలోనూ 2021 నుంచి 3 ఏళ్లపాటు జీతం తీసుకోకూడదని నిర్ణయించారు. కంపెనీ ఆర్థిక స్థిరత్వం, వ్యూహాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Zomatoలో దీపిందర్కు ఉన్న 4.16% వాటా విలువ దాదాపు ₹10 వేల కోట్లు ఉంటుందని అంచనా.
Similar News
News November 27, 2024
ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి
AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.
News November 27, 2024
కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి
TG: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అలాంటి పార్టీని కూకటివేళ్లతో పెకలిస్తామని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వయసుకు మించి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రమే ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండేవని తెలిపారు.
News November 27, 2024
వరంగల్తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు: రామ్మోహన్ నాయుడు
TG: రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో భూసేకరణ పూర్తవ్వగానే వీలైనంత త్వరగా పనులు చేపడుతామని చెప్పారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.