News November 26, 2024
₹3.5 కోట్ల జీతం మళ్లీ వదులుకున్న CEO
Zomato CEO దీపిందర్ గోయల్ ₹3.5 కోట్ల తన వార్షిక వేతనాన్ని మరో రెండేళ్లపాటు(2026 వరకు) వదులుకున్నారు. గోయల్ గతంలోనూ 2021 నుంచి 3 ఏళ్లపాటు జీతం తీసుకోకూడదని నిర్ణయించారు. కంపెనీ ఆర్థిక స్థిరత్వం, వ్యూహాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Zomatoలో దీపిందర్‌కు ఉన్న 4.16% వాటా విలువ దాదాపు ₹10 వేల కోట్లు ఉంటుందని అంచనా.
Similar News
News November 27, 2024
IPL: మ్యాచ్‌లు ఆడకుంటే డబ్బు ఇస్తారా?
IPL వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. రూ.10కోట్లు పలికిన క్రికెటర్‌కు 3ఏళ్ల కాంట్రాక్టు కింద రూ.30కోట్లు దక్కుతాయి. ఆటగాడు మ్యాచ్‌లు ఆడినా ఆడకున్నా సీజన్ మొత్తం జట్టుకు అందుబాటులో ఉంటే అతడికి మొత్తం డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సీజన్ ప్రారంభానికి ముందే ప్లేయర్ జట్టుకు దూరమైతే డబ్బు చెల్లించరు. కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటే దాన్ని బట్టి చెల్లిస్తారు.
News November 27, 2024
దారుణం: 87మందిపై వైద్యుడి అత్యాచారం
నార్వేకు చెందిన ఆర్నీ బై అనే గైనకాలజిస్ట్ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ దానికి కళంకం తీసుకొచ్చాడు. గడచిన 20 ఏళ్లలో 14 నుంచి 67 ఏళ్ల వయసున్న 87మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ అఘాయిత్యాలను రహస్యంగా సీసీటీవీ కెమెరాలో చిత్రీకరించాడు. ఇద్దరు మైనర్ల ఫిర్యాదుతో అతడి ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, 6వేల గంటల ఫుటేజీని అతడి కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు.
News November 27, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సుబ్బరాజు 50కిపైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఎక్కువగా విలన్ పాత్రలు చేసి మెప్పించిన సుబ్బరాజు పలు సినిమాల్లో కామెడీ పాత్రల్లోనూ నటించారు.