News November 19, 2024
రోజుకు 14గంటలు పనిచేయాల్సిందేనన్న CEO.. నెట్టింట విమర్శలు!
ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు చనిపోతున్నారని నెట్టింట విమర్శలూ వచ్చాయి. తాజాగా భారత సంతతి వ్యక్తి, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘గ్రెప్లైట్’ CEO దక్ష్ గుప్తా కూడా రోజుకు కనీసం 14గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివారాలు వర్క్ చేయాలని చెప్పారు. దీంతో నారాయణమూర్తికి శిష్యుడు దొరికాడరనే చర్చ మొదలైంది.
Similar News
News November 19, 2024
నాకు 4 రోజులు టైం కావాలి.. పోలీసులకు RGV మెసేజ్
AP: తనపై నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తనకు 4 రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా 5 రోజుల క్రితం పోలీసులు HYDకు వచ్చి RGVకి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన ఒంగోలు సీఐ కార్యాలయానికి రావాల్సి ఉంది.
News November 19, 2024
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,070కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.700 పెరిగి రూ.70,650గా నమోదైంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరిగి రూ.1,01,000 పలుకుతోంది.
News November 19, 2024
బేబీ బంప్‌తో అతియా శెట్టి.. పిక్స్ వైరల్
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి బేబీ బంప్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే రాహుల్-అతియా జంట ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరికి బిడ్డ జన్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా రాహుల్-అతియా గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు.