News November 21, 2024

నేడు, రేపు గ్రూప్-4 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్ శాఖ ఇవాళ, రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. అన్ని ఒరిజినల్ మెమోలు, ధ్రువపత్రాలతో వెరిఫికేషన్‌కు రావాలని అధికారులు సూచించారు. ఉమ్మడి KNR, WGL, KMM, మెదక్, NZB, ADB జిల్లాలకు ఎంపికైన వారికి HNKలోని కుడా కార్యాలయంలో, ఉమ్మడి RR, HYD, NLG, MBNR జిల్లాల వారికి CDMA ఆఫీసులో వెరిఫికేషన్ జరగనుంది.

Similar News

News November 21, 2024

శాసనమండలిలో గందరగోళం

image

AP శాసనమండలిలో మెడికల్ కాలేజీల అంశంపై YCP, కూటమి సభ్యుల మధ్య రగడ నెలకొంది. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అన్న YCP ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో హజ్ యాత్రను ప్రస్తావించడంపై YCP అభ్యంతరం వ్యక్తం చేసింది. తోటి మంత్రులంతా ఆయన వ్యాఖ్యల్లో తప్పేం లేదంటూ మద్దతుగా నిలిచారు.

News November 21, 2024

తెలుగు హీరోలను ఎంకరేజ్ చేయండి: బ్రహ్మాజీ

image

ప్రతి శుక్రవారం లానే రేపు ముగ్గురు తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. గల్లా అశోక్ ‘దేవకీ నందన వాసుదేవ’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ మూవీలు రేపు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈక్రమంలో నటుడు బ్రహ్మాజీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘మలయాళం, తమిళ హీరోలతో పాటు మన టాలెంటెడ్ తెలుగు హీరోలను కూడా ఎంకరేజ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. మరి మీరు ఏ మూవీకి వెళ్తున్నారు?

News November 21, 2024

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తీర్మానం

image

AP: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉండగా, గతంలో చంద్రబాబు కూడా దీనిపై హామీ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.