News June 29, 2024

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 4 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి జులై 4 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు TGPSC వెల్లడించింది. హైదరాబాద్‌లోని కార్యాలయంలో ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. గత ఏడాది జులైలో నిర్వహించిన రాత పరీక్షకు 913 మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు వెల్లడయ్యాయి.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/

Similar News

News October 17, 2025

జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

image

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్‌గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.

News October 17, 2025

సీతాఫలం.. మహిళల ఆరోగ్యానికి వరం

image

సీతాఫలంలో విటమిన్లు A, C, B6, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మహిళలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మ నిగారింపు, హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. షుగర్, బీపీ, ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఇందులోని కాపర్ గర్భిణుల్లో పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. వాంతులు, మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
#ShareIt

News October 17, 2025

ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించండి: భట్టి

image

TG: BC రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటోందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘దీనిపై అఖిల పక్షంతో PMను కలవాలనుకున్నాం. కానీ ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేం సిద్ధంగా ఉన్నాం. రామ్‌చందర్‌రావు, BJP నేతలు ఇప్పిస్తే కలుస్తాం. రేపటి బంద్ BJPకి వ్యతిరేకంగానే జరుగుతుంది. రిజర్వేషన్లపై SC తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని భట్టి అన్నారు.