News March 18, 2024
సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
AP: ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆయా ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చే వరకు జారీ చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయ్యింది.
Similar News
News November 15, 2024
సూపర్-6 హామీలపై చేతులెత్తేయడం తగదు: ముద్రగడ
AP: సీఎం చంద్రబాబుకు YCP నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సూపర్-6 హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. వీటిని అమలు చేయాలంటే రూ.కోట్లు కావాలనే సంగతి అప్పుడు మీకు తెలియదా? అని నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి ప్రసాదం, రెడ్‌బుక్, SM పోస్టింగులపై చర్యలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయని పేర్కొన్నారు.
News November 15, 2024
గుండెపోటు మరణాలు.. యువతలో ఆందోళన!
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
News November 15, 2024
దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?
భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.