News November 7, 2024
కులగణనకు మద్దతుగా చైతన్య యాత్ర

TG: కులగణనకు మద్దతుగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చైతన్య యాత్రను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కులగణన సమగ్రంగా జరిగితే BCల లెక్క తేలుతుందన్నారు. దీంతో జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్, రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ యాత్ర ద్వారా 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 650 మండలాలు, 12,750 గ్రామాల్లో బీసీలను చైతన్యం చేస్తామని ఆయన చెప్పారు.
Similar News
News September 13, 2025
ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
News September 13, 2025
ASIA CUP: నిప్పులు చెరిగిన లంక బౌలర్లు

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. నువాన్ తుషారా, దుష్మంత చమీర నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఖాతా తెరవకుండానే బంగ్లా తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్(0), పర్వేజ్ ఎమోన్(0) డకౌట్లుగా వెనుదిరిగారు. హృదోయ్ (8) రనౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 5 ఓవర్లలో 16/3గా ఉంది.
News September 13, 2025
ఆ ఊరి నిండా IAS, IPSలే!

UPలోని మాధోపట్టి గ్రామం UPSC ఫ్యాక్టరీ, IAS విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామం 50 మందికిపైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. వారంతా IAS, IPS, IRS, IFS ఆఫీసర్లుగా సేవలందిస్తున్నారు. 1914లో ముస్తఫా ఈ గ్రామం నుంచి మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే కుటుంబంలో నలుగురు సోదరులు సివిల్స్‌కు ఎంపిక కావడంతో ఆ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఈ ఊరికి వచ్చిన కోడళ్లు కూడా IAS, IPS సాధించారు.