News September 30, 2024
‘తండేల్’ సాంగ్ షూటింగ్లో చైతూ-సాయి పల్లవి

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ‘తండేల్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం సినిమాలోని శివపార్వతుల సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు షూటింగ్ ఫొటోలను పంచుకున్నారు. ఇందులో డాన్సర్లతో కలిసి చైతూ, సాయి పల్లవి స్టెప్పులేసే సన్నివేశాన్ని చూపించారు. ఇద్దరి కాంబో చూడముచ్చటగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
News November 22, 2025
తైవాన్‌పై దాడికి రెడీ అవుతున్న చైనా

సివిలియన్ షిప్స్‌ను ఉపయోగించి తైవాన్‌పై దాడి చేయడానికి చైనా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సైనిక శిక్షణలకు సివిలియన్ నౌకలను వినియోగించడమూ ఈ వార్తలకు బలాన్నిస్తోంది. తైవాన్‌పై చైనా సైబర్ దాడులు చేస్తూ ఆర్థికంగా ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో యుద్ధానికి కూడా సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. ఆర్థికంగా దెబ్బతీస్తే తమతో యుద్ధానికి దిగే సాహసం తైవాన్ చేయదనే ప్లాన్‌లో కూడా చైనా ఉన్నట్టు తెలుస్తోంది.