News May 11, 2024
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో సవాళ్లు! – 1/2

సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం, జాప్యం, నైపుణ్య కొరత సవాళ్లుగా మారుతున్నాయి. 2022కి 40 గిగావాట్ల కెపాసిటీతో రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేయాలని 2015లో కేంద్రం భావిస్తే, గత ఏడాదికి 11 గిగావాట్లే ఏర్పాటయ్యాయి. ఈ టార్గెట్ ఇప్పుడు 2026కి 100 GWకు పెంచింది. ఇక పలు ప్రాంతాల్లో మినిమమ్ ఛార్జ్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నెలకు రూ.500 వసూలు చేస్తున్నాయట.
Similar News
News December 6, 2025
మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్‌కు 1,185 నామినేషన్లు

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్‌కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.
News December 6, 2025
రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.


