News September 15, 2024

ఇవాళ PHC వైద్యుల ‘చలో విజయవాడ’

image

AP: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ PHC వైద్యులు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది. నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఇవాళ చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. దీంతో విజయవాడలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Similar News

News November 1, 2025

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

News November 1, 2025

టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

image

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.

News November 1, 2025

కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.