News March 10, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ సందడి.. ఫొటో గ్యాలరీ

image

కివీస్‌పై గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గర్వంగా ముద్దాడిన వేళ జట్టు సభ్యులు ఆనందంగా కనిపించారు. తోటి ప్లేయర్లతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అలాగే గత రికార్డులతో పోలుస్తూ ఫ్యాన్స్ కొన్ని ఫొటోలను క్రియేట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పైన ఉన్న గ్యాలరీలో భారత ఆటగాళ్ల CT గెలుపు సంబరాలు చూడొచ్చు.

Similar News

News March 10, 2025

పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తా: బుద్ధా వెంకన్న

image

AP: తనకు MLC టికెట్ రాకపోవడంపై మాజీ MLC బుద్ధా వెంకన్న స్పందించారు. CM చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్నారు. రాజకీయ క్రీడలో ఒక్కోసారి పదవులు రావని చెప్పారు. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడని, పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తానన్నారు. పదవి ఇస్తే ఒకలాగా, లేకపోతే మరోలా ఉండటం తనకు చేతకాదన్నారు. వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామో, రానప్పుడూ అంతే హుందాగా ఉంటానని చెప్పారు.

News March 10, 2025

ALERT: మూడు రోజులు జాగ్రత్త

image

తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు అధికంగా నీరు తాగండి, చెప్పులు ధరించండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. నీరు తాగినప్పటికీ దాహంగా ఉంటే ORS తాగడం బెటర్. టీ- కాఫీలాంటి వాటికి దూరంగా ఉండండి. అధిక ప్రొటీన్ ఆహారం కూడా వద్దు.

News March 10, 2025

జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు: అనగాని

image

AP: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.

error: Content is protected !!