News November 12, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం.. పాక్ సంచలన నిర్ణయం?

image

PAKలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో పాక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌తో సమస్య పరిష్కారమయ్యే వరకు ICC లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్‌లు ఆడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పాక్ క్రికెట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినట్లు పాక్ పత్రిక ది డాన్ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానమేనని పేర్కొంది.

Similar News

News December 10, 2025

నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

News December 10, 2025

బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

image

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News December 10, 2025

సౌదీలో నాన్ ముస్లింలకు లిక్కర్ విక్రయాలు!

image

సౌదీలో నాన్ ముస్లింలు లిక్కర్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు 50వేల రియాల్స్(13,300డాలర్లు), అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మద్యం కొనే టైంలో శాలరీ స్లిప్ చూపించాలనే నిబంధన పెట్టనుందట. ప్రస్తుతం రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఒకే ఒక లిక్కర్ షాపు ఉంది. భవిష్యత్తులో మద్యం షాపుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.