News October 9, 2024

దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక వేళ టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్తే దుబాయ్ వేదికగా ఫైనల్ నిర్వహించాలని ICC యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే లాహోర్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ కోసం భారత్ పాక్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. హైబ్రిడ్ విధానంలో టీమ్ ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించాలని ICCని BCCI కోరుతోంది. దీనిపై ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు టాక్.

Similar News

News October 25, 2025

పల్లీలే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు!

image

ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ను మించిన ప్రయోజనాలు పల్లీల్లో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ కాలం జీవించేందుకు కావాల్సిన 20 అమైనో ఆమ్లాలు వీటిలో ఉన్నాయని తెలిపారు. ‘పల్లీల్లోని ప్రొటీన్ బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది’ అని చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ తినే పల్లీలను తేలిగ్గా తీసిపారేయొద్దు.

News October 25, 2025

INTER సిలబస్‌లో సమూల మార్పులు: బోర్డు

image

TG: ఇంటర్ సిలబస్‌ను NCERT గైడ్‌లైన్స్ ప్రకారం రివిజన్ చేస్తామని బోర్డు సెక్రటరీ కృష్ణ చైతన్య తెలిపారు. ‘గణితం, ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీల రివిజన్ జరిగి 13 ఏళ్లయింది. ఇతర సబ్జెక్టుల రివిజనూ 2020కి ముందు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వీటిని అప్‌డేట్ చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లతో అధ్యయనం చేయించి వారి సూచనలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.

News October 25, 2025

RO-KO షో.. రికార్డులు బద్దలు

image

* ODIల్లో మోస్ట్ 150+ పార్ట్‌నర్‌షిప్స్: సచిన్-గంగూలీ రికార్డు సమం చేసిన RO-KO(12)
* ODIs+T20Isలో అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ(18,443*). సచిన్ రికార్డు బద్దలు(18,436)
* వన్డేల్లో సచిన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కోహ్లీ(14,255*)
* 101 ఇన్నింగ్స్‌ల్లో 19సార్లు 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన RO-KO
* ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ 50* సెంచరీలు
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్: రోహిత్