News March 10, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. వ్యూస్‌లో రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (INDvsNZ) జియో హాట్‌స్టార్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచుగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి హాట్‌స్టార్‌లో వ్యూస్ సంఖ్య 90.1కోట్లకు చేరింది. పోటాపోటీగా సాగిన మ్యాచును వీక్షించేందుకు క్రీడాభిమానులు అమితాసక్తి కనబరిచారు. దీంతో INDvsAUS సెమీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్‌ను (66 కోట్లు) ఫైనల్ అధిగమించింది. గత నెల 23న జరిగిన INDvsPAK మ్యాచుకు 60.2కోట్ల వ్యూస్ వచ్చాయి.

Similar News

News March 31, 2026

అప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదు: జడేజా

image

CSK నుంచి రాజస్థాన్ జట్టులోకి ఛేంజ్ అయినప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదని జడేజా తెలిపారు. ‘ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతారు. అందుకే మాట్లాడలేదు’ అని నవ్వేశారు. నిన్న కలిసే అవకాశం రాలేదని, ఈసారి మీట్ అయినప్పుడు అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం ఖలీల్ ధరించిన CSK జెర్సీని జడేజా కిస్ చేశారు. గత సీజన్ వరకు CSK జట్టులో జడ్డూ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News March 31, 2026

ఏఐ డేటా సెంటర్.. 2 డిగ్రీలు పెరగనున్న హీట్?

image

ఏఐ డేటా సెంటర్ల వల్ల అభివృద్ధితోపాటు ఉష్ణోగ్రతా పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘డేటా సెంటర్‌కు భారీగా వాటర్, ఎలక్ట్రిసిటీ అవసరం. అలాగే ఆ కేంద్రం వల్ల 9.9KM విస్తీర్ణంలో హీట్ 2 డిగ్రీల వరకు అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో 9 డిగ్రీల వరకు పెరగవచ్చు. తద్వారా 34 కోట్ల మందిపై ప్రభావం పడొచ్చు. దీన్నే డేటా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం’ అని నిపుణులు తెలిపారు. కాగా ఆ స్టడీపై రివ్యూ జరగాల్సి ఉంది.

News March 31, 2026

సెక్స్ కోసం భార్యను బలవంతం చేయడం రేపే: చిన్మయి

image

‘చిరైయా’ సిరీస్‌లో భార్యకు ఇష్టం లేకుండా భర్త శృంగారం చేసే సీన్‌పై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించారు. ‘పెళ్లయినంత మాత్రాన ఎదుటివారికి ఇష్టం లేకపోయినా ముహూర్తం పేరుతో శృంగారానికి బలవంతం చేయడం తప్పు. ఇది రేప్ కిందకే వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భర్త గురించి తెలుసుకునే సమయం కూడా దొరకదు’ అని Xలో రాసుకొచ్చారు. దంపతుల మధ్య గౌరవం, ఇష్టం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.