News November 30, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ అంగీకారం.. కానీ!

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకు పాక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు పలు కండీషన్లు పెట్టిందని ICC వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం.. భారత్ మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఒకవేళ గ్రూప్ స్టేజ్ దాటి భారత్ క్వాలిఫై కాకపోతే సెమీస్, ఫైనల్స్ పాక్‌లో నిర్వహించాలి. టోర్నీకి తమకు వచ్చే ఆదాయాన్ని పెంచాలి. 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలను పాక్ కూడా హైబ్రిడ్ విధానంలోనే ఆడుతుంది.
Similar News
News March 11, 2026
20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు: జగన్

AP: సీఎం చంద్రబాబు 20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. తాము కరోనా పరిస్థితుల్లోనూ తక్కువగానే అప్పులు చేశామని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదని, చంద్రబాబు బిల్డప్ మాత్రమే ఇస్తున్నారని ఫైరయ్యారు. అసెంబ్లీలోనూ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదని ప్రెస్ మీట్లో మండిపడ్డారు.
News March 11, 2026
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆహారపదార్థాలను ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS, టైప్2 డయాబెటిస్, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News March 11, 2026
మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.


