News June 1, 2024

CHANAKYA X SURVEY: సికింద్రాబాద్‌లో నువ్వానేనా!

image

HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, చేవెళ్లలో BJP అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో BJP అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. ఇక సికింద్రాబాద్‌లో మాత్రం BRS అభ్యర్థి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, BJP అభ్యర్థి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందని అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News November 28, 2025

కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

image

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.

News November 28, 2025

శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

image

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News November 28, 2025

HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.