News June 1, 2024
CHANAKYA X SURVEY: సికింద్రాబాద్లో నువ్వానేనా!
HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, చేవెళ్లలో BJP అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో BJP అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. ఇక సికింద్రాబాద్లో మాత్రం BRS అభ్యర్థి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, BJP అభ్యర్థి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందని అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News January 15, 2025
HYD: పొలం అనుకుంటే పొరపాటే..!
ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.
News January 15, 2025
HYD: జంక్షన్ల అభివృద్ధి పై GHMC FOCUS
గ్రేటర్ HYDలో జంక్షన్లలో వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాల సుందరీకరణపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ సర్కిల్ సంత్ నిరాకారి భవన్ జంక్షన్ ప్రాంతాన్ని అద్భుతమైన కళారూపాలతో తీర్చిదిద్ది, ప్రత్యేకంగా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్తున్న వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది.
News January 15, 2025
HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలోప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.