News March 22, 2024

జంపా స్థానంలో తనుష్‌కు ఛాన్స్

image

IPLకు దూరమైన ఆడమ్ జంపా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కుర్రాడికి చోటిచ్చింది. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ముంబై స్పిన్నర్ తనుష్ కొటియన్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. రంజీలో అతడు 502 రన్స్, 29 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. పని ఒత్తిడి కారణంగా IPL ఆడలేనని జంపా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. RR అతడిని మినీ వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.

Similar News

News October 16, 2025

మేడారం పనులు R&Bకి బదిలీ

image

TG: మేడారం టెండర్లపై మంత్రుల మధ్య <<18018400>>వివాదం<<>> వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పనులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు బదిలీ చేసింది. దేవాదాయ శాఖకు పనులను పర్యవేక్షించే సాంకేతికత లేదని, పనుల స్వభావం, నాణ్యత, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రికార్డులను R&Bకి అప్పగించాలని ఆదేశించింది. కొండా సురేఖ ఎండోమెంట్ మంత్రిగా ఉన్నారు.

News October 16, 2025

నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

image

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.

News October 16, 2025

పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

image

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్‌-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.