News August 26, 2025
ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Similar News
News August 26, 2025
మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కన్వీనర్ సూచనలు

AP: * ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి కాల్ <
* ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
* ఆలోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లాగిన్ ద్వారా సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సినవి కులం సర్టిఫికెట్(వర్తిస్తే), అంగవైకల్య ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే), కాల్ లెటర్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు.
News August 26, 2025
BIG ALERT.. అతి భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News August 26, 2025
10,270 ఉద్యోగాలు.. ఎల్లుండితో ముగియనున్న గడువు

IBPS క్లర్క్ పోస్టులకు ఎల్లుండితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. వెబ్‌సైట్: <
>>SHARE IT