News November 30, 2024
ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలకు అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6గంటల్లో 10kmph వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ సాయంత్రానికి కారైకాల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News April 3, 2026
మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.
News April 3, 2026
ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర
News April 3, 2026
‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.


