News September 22, 2024

ముంపు నష్టం నమోదుకు నేడు, రేపు అవకాశం

image

AP: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశామని, కొత్తగా రూ.9.62 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేడు, రేపు సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని తెలిపారు. సోమవారం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

Similar News

News September 22, 2024

తిరుమల నెయ్యి వివాదం.. పోలీసులకు ‘అమూల్’ ఫిర్యాదు

image

తిరుమలకు లడ్డూ ప్రసాద తయారీకి తాము కల్తీ నెయ్యిని పంపినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని గుజరాత్‌లో అమూల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దీనిపై పోలీసులు FIR నమోదు చేశారు. తాము ఇప్పటివరకు టీటీడీకి ఆవు నెయ్యి సప్లై చేయలేదని అమూల్ స్పష్టం చేసింది.

News September 22, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

చెస్ ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్‌లో భారత్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్‌ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్‌ ఓడించారు. ఈయన నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.

News September 22, 2024

ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు

image

AP: తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.