News July 13, 2024

గుజరాత్‌లో చాందిపుర వైరస్.. నలుగురు చిన్నారులు మృతి

image

గుజరాత్‌లో‌ని సబర్‌కాంతా జిల్లాలో ‘చాందిపుర వైరస్’ లక్షణాలతో నలుగురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారి రక్తనమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు వైద్యులు పంపారు. రాబ్డోవిరిడే జాతి దోమలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది సోకితే జ్వరం, ఫ్లూ, మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. 1965లో మహారాష్ట్రలోని చాందిపురలో ఈ వైరస్‌ను గుర్తించడంతో అదే పేరు పెట్టారు.

Similar News

News January 19, 2026

సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

image

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

News January 19, 2026

త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CBN

image

ఏపీలో ఈ ఏడాది డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్సులు తీసుకొస్తున్నట్లు CM CBN తెలిపారు. విశాఖకు రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని జూరిచ్ తెలుగు డయాస్పోరా మీటింగ్‌లో పేర్కొన్నారు. ‘NRI‌లను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.50కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తాం. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తున్నాం’ అని చెప్పారు. బెస్ట్ వర్సిటీల్లో చదవాలనుకునే వారికి 4% వడ్డీతో రుణాలిస్తామన్నారు.

News January 19, 2026

గుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏమన్నారంటే?

image

కొలెస్ట్రాల్ భయంతో గుడ్లు తినడం మానేశారా? అయితే ఈ విషయం మీ కోసమే. గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని పైగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం స్వల్పమేనని, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ తినాలని సూచిస్తున్నారు.