News August 21, 2024
చాందీపురా వైరస్.. 28మంది చిన్నారులు మృతి

చాందీపురా <<13646193>>వైరస్<<>> బారిన పడి గుజరాత్లో ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిశికేశ్ పటేల్ తెలిపారు. జులైలో తొలి కేసు నమోదవ్వగా మరణించిన వారంతా 14 ఏళ్ల లోపేనని చెప్పారు. మెదడువాపు సంబంధిత వైరస్‌తో ఇప్పటివరకు 101 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారం రోజులుగా ఎలాంటి కేసులు నమోదవ్వలేదన్నారు.
Similar News
News January 7, 2026
మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.
News January 7, 2026
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.
News January 7, 2026
భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.


